జగన్‌కు చివరికి మిగిలేది నేమ్‌ప్లేటే: దేవినేని ఉమ సెటైర్
- ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన జగన్ నేమ్‌ప్లేట్
- రూ. 300 కోట్లు తీసుకుని జగన్‌కు పీకే ఇచ్చింది ఇదేనన్న దేవినేని
- టీడీపీ విజయం ఏకపక్షమన్న మంత్రి
జగన్ చేయించుకున్నట్టుగా చెబుతున్న ఓ నేమ్ ప్లేట్ ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి’ అన్న నేమ్ ప్లేట్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టింది. ప్రజా తీర్పు వెల్లడి కావడానికి ముందే జగన్ తానే సీఎంనంటూ నేమ్‌ప్లేట్లు కూడా చేయించుకుంటున్నారంటూ టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. తాజాగా దేవినేని ఉమ సెటైర్లు వేశారు.