ఒక్క మహిళా ఓటరు కోసం 483 కిలోమీటర్లు ప్రయాణించిన ఏడుగురు సిబ్బంది!
- ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువ
- టిబెట్ సరిహద్దుల్లో మలోగామ్ గ్రామం
- ఒక ఓటు కోసం ప్రయాసతో వెళ్లిన అధికారులు
అత్యంత ప్రయాసతో 483 కిలోమీటర్ల దూరాన్ని నాలుగు రోజుల పాటు ప్రయాణించిన అధికారులు, ఓ మహిళతో ఓటు వేయించారు. గమ్మర్ బామ్ అనే ప్రిసైడింగ్ అధికారి, తన నలుగురు సిబ్బంది, ఓ సెక్యూరిటీ గార్డు, ఓ జర్నలిస్ట్ తో కలిసి వెళ్లి, సొకేలా తయాంగ్ అనే మహిళ ఓటు వేసేలా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పౌరులకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాలు కల్పించడమే ముఖ్యమని, అది ఒకరైనా, వేలమందైనా ఒకటేనని వ్యాఖ్యానించడం గమనార్హం.