Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ యువతికి బెదిరింపులు!

  • జూబ్లీహిల్స్ లోని పత్రికా కార్యాలయంలో పనిచేస్తున్న యువతి, యువకుడు
  • స్నేహం ప్రేమగా మారగా కొన్ని సెల్ఫీలు, ఫోటోలు
  • యువకుడి వైఖరి చూసి దూరం పెట్టిన యువతి
తనను ప్రేమించి, ఆ తరువాత దూరం పెడుతున్న ఓ యువతిని బెదిరిస్తున్న యువకుడిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. హైదరాబాద్, జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ పత్రికా కార్యాలయంలో ఇది జరగడం గమనార్హం. పోలీసులు, బాధితురాలు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, పత్రికాఫీసులో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న యువతి (18), అదే ఆఫీసులో పనిచేస్తున్న శివ (22) అనే ఉద్యోగి మధ్య స్నేహం ఏర్పడింది.

వీరి పరిచయం ప్రేమగా మారగా, సన్నిహితంగా ఉన్న సమయంలో కొన్ని ఫోటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. ఆపై అతని వైఖరి నచ్చక అతన్ని దూరం పెట్టిన యువతిని, శివ వేధించడం ప్రారంభించాడు. ఈలోగా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయం కాగా, తనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. నెల రోజుల పాటు వేచి చూసిన ఆమె, ఇక తాళలేక, కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సదరు యువతి కుటుంబీకులకు హామీ ఇచ్చారు.
Lovers
Hyderabad
Photos
Selfy
Police

More Telugu News