పవన్ మామయ్య బైక్ పైనే సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను .. ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు: సాయిధరమ్ తేజ్

  • పవన్ మామయ్య బొమ్మలు కొనిపెట్టేవాడు
  • సినిమాల దిశగా నన్ను ఆయనే ప్రోత్సహించాడు
  •  నేను ఫలానా అని ఎవరికీ చెప్పలేదు  
తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ తో తనకి గల అనుబంధాన్ని గురించి ప్రస్తావించాడు. "నా చిన్నప్పుడు పెద్ద మామయ్య చిరంజీవి షూటింగులతో బిజీగా ఉండేవారు. పవన్ మామయ్య మాత్రం మాతోనే ఎక్కువగా ఉండేవారు. ఆయన మమ్మల్ని బయటికి తీసుకెళ్లడం .. బొమ్మలు కొనివ్వడం చేసేవారు. అందువలన ఆయనతో ఎంతో చనువు వుంది.

సినిమా ప్రయత్నాల దిశగా కూడా ఆయనే నన్ను ప్రోత్సహించారు. అప్పట్లో ఆయనకి బజాజ్ ఎవెంజర్ బైక్ వుండేది. నేను సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడుతుంటే, ఆ బైక్ ను వాడుకోమన్నారు. ఆ బైక్ పైనే నేను సినిమా ఆఫీసులకి తిరుగుతూ నా ఫోటోలు .. ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. నేను ఫలానా అని ఎవరికీ చెప్పేవాడిని కాదు. ఏ మాత్రం అవకాశం వున్నా కాల్ చేస్తామని అనేవారు. కానీ ఎవరి నుంచి ఎలాంటి కాల్ రాలేదు. ఆ తరువాత మంచు మనోజ్ తో కలిసి క్రికెట్ ఆడుతుంటే వైవిఎస్ చౌదరి గారు చూసి తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు" అని చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
saidharam tej

More Telugu News