Andhra Pradesh: చంద్రబాబు లాంటి లీడర్ తమిళనాడుకు లేరే అని బాధపడుతున్నా!: దర్శక-నిర్మాత టి.రాజేందర్

  • ఏపీ సీఎంపై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసలు
  • బాబు, మమత సమయానుకూలంగా వ్యవహరిస్తారని కితాబు
  • ప్రజలంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు
ప్రజలంతా ధైర్యంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోలీవుడ్ దర్శక-నిర్మాత టీ.రాజేందర్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో లోక్ సభతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజేందర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ.. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు. డబ్బుల కోసం ఓటు వేస్తే నష్టపోతామని వ్యాఖ్యానించారు. తమిళనాడులో జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజ నేతలు లేని సమయంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేసే వ్యక్తులకు ఓటేయాలని రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘ఏపీలో చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ మంచి రాజకీయ నాయకులు. వీళ్లు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. అలాంటి వాళ్లు ఇప్పుడు తమిళనాడుకు లేరు.

ఇలాంటి లీడర్ ప్రస్తుతం తమిళనాడుకు లేరే? అదే విషయమై నేను బాధపడుతున్నా. అందుకే ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాను. ఓటు హక్కును వినియోగించుకున్నాను. నాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)లపై నమ్మకం లేదు సార్’ అని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Chandrababu
Tamilnadu
t rajender

More Telugu News