poonam kaur: యూట్యూబ్ చానెళ్లలో తనపై అసభ్యకర ప్రచారం జరుగుతోందంటూ నటి పూనం కౌర్ ఫిర్యాదు

  • అశ్లీల చిత్రాలు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదు
  • స్పందిస్తే మరింత రెచ్చిపోతారనే ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదన్న నటి
  • హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు
యూట్యూబ్ చానెళ్లలో తనపై అసభ్య ప్రచారం జరుగుతోందని ప్రముఖ నటి పూనమ్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకర రాతలు రాస్తూ, అశ్లీల వీడియోలు పోస్టు చేస్తూ తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు పూనం ఫిర్యాదు చేశారు. మొత్తం 50 చానళ్లు తనపై అసభ్యకర ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తనపై జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తే మరింత రెచ్చిపోతారన్న ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే, దీనిని అలుసుగా తీసుకున్న యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు ప్రతిరోజూ పోస్టులు పెట్టి తనను మానసికంగా మరిన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారని పూనం కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

poonam kaur
Tollywood
youtube
Cyber crime police
Hyderabad

More Telugu News