Ravindra Jadeja: క్రికెటర్ రవీంద్ర జడేజా ట్వీట్ కు నరేంద్ర మోదీ సమాధానం!

  • బీజేపీ గెలుపును కాంక్షిస్తూ వ్యాఖ్యలు
  • మద్దతు పలకాలన్న రవీంద్ర జడేజా
  • కృతజ్ఞతలు తెలిపిన నరేంద్ర మోదీ
బీజేపీ గెలుపును కాంక్షిస్తూ, ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజాకు ప్రధాని సమాధానం ఇచ్చారు. "బీజేపీకి మద్దతు పలకండి... జై హింద్" అని జడేజా ట్వీట్ చేయగా, తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలన్న ప్రధాని, వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కు ఎన్నికైనందుకు జడేజాకు అభినందనలు తెలిపారు. జడేజాతో పాటు నటులు కబీర్ బేడీ, రణ్ వీర్ షోరే కూడా మోదీకి మద్దతు వ్యాఖ్యలు చేశారు. భారత ఉత్తమ ప్రధాని మీరేనని కబీర్ బేడీ వ్యాఖ్యానించగా, నరేంద్ర మోదీకి ఓటు వేయాలని రణ్ వీర్ షోరే ఓ వీడియోను పోస్ట్ చేశారు. వీటిపైనా నరేంద్ర మోదీ స్పందించారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న అసోం, వెస్ట్ బెంగాల్, కేరళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Ravindra Jadeja
Narendra Modi
BJP

More Telugu News