Andhra Pradesh: ఏపీలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఈసీ సిఫారసు

  • కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఈసీ సిఫారసు
  • గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో ఒక చోట  
  • ఈరోజు రాత్రికి రీపోలింగ్ తేదీలు ప్రకటించే అవకాశం
ఏపీలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఈసీ సిఫారసు చేసింది. గుంటూరులో 2, నెల్లూరులో 2, ప్రకాశంలో ఒక చోట రీపోలింగ్ నిర్వహించాలని సిఫారసు చేసింది. ఈరోజు రాత్రికి రీపోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో వీవీ ప్యాట్ లు, ఈవీఎంల తరలింపుపై చర్యలకు అధికారులు సిద్ధమైనట్టు సమాచారం. కాగా, హింసాత్మక ఘటనలు, సాంకేతిక కారణాల వల్ల ఆయా కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని, రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ సిఫారసు చేసింది. 
Andhra Pradesh
EC
guntr
nellore
prakasam

More Telugu News