ఇక్కడ పవన్ అభిమానులు ఎక్కువ.. గెలుపు నాదే: అనకాపల్లి జనసేన అభ్యర్థి భాస్కరరావు
- రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంతో అనుబంధం ఉంది
- ఎంతో మందికి ఉపాధి కల్పించా
- కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలుస్తా
తాజాగా అనకాపల్లి జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కరరావు కూడా తాను విజయం సాధించబోతున్నానని అన్నారు. రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంతో తనకు అనుబంధం ఉందని ఆయన తెలిపారు. శారదానగర్ కంపోస్టు యార్డ్, రామాపురం శ్మశానవాటిక సమస్యలను పరిష్కరించానని చెప్పారు. ఎంతో మందికి ఉపాధి కల్పించానని అన్నారు. నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని... కనీసం వెయ్యి ఓట్ల మెజార్టీతో తన గెలుపు ఖాయమని చెప్పారు.