ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్పు బోల్తా.. బాధితుల్లో కూకట్ పల్లి వాసులు!

ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా మార్కాపురం మండలంలోని కోమటికుంటలో బస్సు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో హైదరాబాద్, కూకట్ పల్లి వాసులు ఉన్నట్టు సమాచారం. బస్సును అధిక వేగంతో నడపడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Prakasam District
markapuram
travels bus
hyd

More Telugu News