విశాఖపట్నంలో దారుణం.. ఆడుకుంటూ సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయి బాలుడు మృతి!
- జిల్లాలోని పీతవానిపాలెంలో ఘటన
- ఉదయాన్నే ఇంటిబయట ఆడుకుంటున్న కార్తీక్
- సెప్టిక్ ట్యాంకులో మునిగిపోయి దుర్మరణం
అయితే చిన్నారి కేకలు ఎవ్వరికీ వినిపించలేదు. దీంతో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడిన బాలుడు సెప్టిక్ ట్యాంకులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అయితే కొద్దిసేపటి అనంతరం బాలుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, స్థానికులు చుట్టుపక్కల గాలించారు. ఈ క్రమంలో పిల్లాడిని సెప్టిక్ ట్యాంక్ లో విగతజీవిగా గుర్తించారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో కార్తీక్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన విశాఖపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.