ఈసారి వైరముత్తు కనిపిస్తే చెంప పగులగొడతా: చిన్మయి

  • ఓ వ్యక్తి చెంప పగులగొట్టిన ఖుష్బు
  • వైరల్ అయిన వీడియో
  • చిన్మయికి ట్వీట్ చేసిన నెటిజన్
ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నేత ఖుష్బు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె అతని చెంప పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఓ నెటిజన్ దీనిని చిన్మయికి షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

‘ఈ మాటలు కేవలం చిన్మయి కోసం మాత్రమే.. మహిళలతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తికి ఖుష్బూ మేడం సరిగ్గా బుద్ధి చెప్పారు’ అని ఆ నెటిజన్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ని చూసిన చిన్మయి వెంటనే కామెంట్ పెట్టారు. ‘కచ్చితంగా.. ఈ సారి నాకు వైరముత్తు కనిపిస్తే తప్పకుండా చెంప పగులగొట్టాలన్న విషయం గుర్తు పెట్టుకుంటా. చూస్తుంటే.. నాకు కేవలం ఈ విధంగా మాత్రమే న్యాయం జరిగేలా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

ప్రముఖ తమిళ సినీ రచయిత వైరముత్తు తనను పదేళ్ల క్రితం లైంగికంగా వేధించారని ఆమధ్య ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా ప్రముఖ గాయని చిన్మయి ఆరోపించిన సంగతి, ఇది పెద్ద వివాదం అయిన విషయం విదితమే.
Go Back to Shorts
Chinmayi
Viramuttu
Khushbu
Publicity
Video

More Telugu News