Andhra Pradesh: ‘రెడ్లు’ జగన్ కే ఓటేశారు కానీ, ఈ వేవ్ లో అదంతా కొట్టుకుపోయింది: జేసీ దివాకర్ రెడ్డి

  • ‘రెడ్డి’ అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా కనిపించింది
  • రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ వేవ్ మహిళల్లో వచ్చింది
  • ఈ వేవ్ లో జగన్ కు పడ్డ రెడ్ల ఓట్లు కొట్టుకుపోయాయి
ఈ ఎన్నికల్లో ‘రెడ్డి’ అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా కనిపించిందని, ఏపీలో ఉన్న రెడ్లు మెజార్టీ శాతం జగన్ కే ఓటేశారని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈరోజు విలేకరులతో జేసీ ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ వేవ్ మహిళల్లో ఉండటంతో ఆ ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని, దీంతో, రెడ్ల ఓట్లు జగన్ కు పడినప్పటికీ, ఈ వేవ్ లో అదంతా కొట్టుకుపోయిందని అన్నారు. మొన్నరాత్రి వరకు అనంతపురం, శింగనమల, గుంతకల్ నియోజకవర్గాల్లో ఓడిపోతామనుకున్నానని, నిన్న ఉదయం క్యూలో మహిళలను చూశాక ఏడు అసెంబ్లీ స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఓ లెక్క, ఇప్పుడు జరిగిన ఎన్నికలు మరో లెక్క అన్న అభిప్రాయాన్ని జేసీ వ్యక్తం చేశారు. 
Andhra Pradesh
Telugudesam
mp
Jc
Diwaker reddy

More Telugu News