raghuveera: చీకటి గదుల్లో పోలింగ్ నిర్వహిస్తారా?: రఘువీరా

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శలు కురిపించారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. పోలింగ్ జరిగిన తీరు దారుణంగా ఉందని అన్నారు. రాత్రి పూట చీకటి గదుల్లో పోలింగ్ ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. అర్ధరాత్రి దాటినా పోలింగ్ నిర్వహించడం దారుణమని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని... ఈ నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు నివసిస్తున్న ప్రాంతాల్లో ఏపీలోని మూడు పార్టీలు కలసి వచ్చి కాంగ్రెస్ కోసం ప్రచారం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Go Back to Shorts
raghuveera
congress
ec

More Telugu News