Narendra Modi: ‘బాలాకోట్‌ విజేతలను ఎన్నుకోండి’ అన్న మోదీ మాటపై ఈసీ ఆరా

  • లాతూర్‌ సభలో దాడుల అంశంపై మాట్లాడిన ప్రధాని
  • ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్న విపక్షాలు
  • నివేదిక ఇవ్వాలని స్థానిక అధికారులను ఆదేశించిన ఈసీ
పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌ ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించిన వారిని గెలిపించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఈనెల 9వ తేదీన మహారాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు బాలాకోట్‌ విజేతలను గుర్తించాలని, వారిని ఎన్నుకోవాలని కోరారు.

ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ప్రధాని వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ఈసీ స్థానిక అధికారులను నివేదిక కోరింది. ప్రధాని ప్రసంగం వీడియో తెప్పించుకున్నామని, దాన్ని పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్‌ అధికారి చంద్రభూషణ్‌ కుమార్‌ తెలిపారు. ఈ అంశంపై జిల్లా అధికారి ఇచ్చిన వివరణను మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేమని స్పష్టం చేశారు.
Narendra Modi
balakot rides
latur
EC

More Telugu News