prathipati pullarao: ఘన విజయం సాధించబోతున్నా... మే 23న మీకే తెలుస్తుంది: ప్రత్తిపాటి పుల్లారావు

  • టీడీపీ అఖండ విజయం సాధించబోతోంది
  • కుల రాజకీయాలు చేయాలనుకున్నవారిని ప్రజలు తిరస్కరించారు
  • చంద్రబాబు గెలుపు కోసం పార్టీ శ్రేణులు కసితో పని చేశాయి
చిలకలూరిపేట నియోజకవర్గంలో తాను ఘన విజయం సాధించబోతున్నానని... మే 23న ఆ విషయం మీకే తెలుస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పారు. టీడీపీకి ముస్లిం మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలబడ్డారని తెలిపారు. కుల రాజకీయాలతో రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టాలనుకున్నవారిని ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని చెప్పారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తే వచ్చేదేమీ లేదని... ప్రజలతో మమేకం కావాలని అన్నారు. చంద్రబాబు గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కసిగా పని చేశారని చెప్పారు.
prathipati pullarao
Telugudesam
Chandrababu

More Telugu News