ఎన్నికల వేళ మావోయిస్టుల దుశ్చర్య.. పోలింగ్ కేంద్రానికి సమీపంలో బాంబు దాడి!
- ఐఈడీని పేల్చివేసిన మావోయిస్టులు
- మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో ఘటన
- తప్పిన ప్రాణనష్టం, ఊపిరి పీల్చుకున్న అధికారులు
ఈరోజు ఉదయం 10.30 గంటల సమయంలో పోలింగ్ కేంద్రానికి 150 మీటర్ల దూరంలో పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. గడ్చిరోలీతో పాటు మరో 6 లోక్ సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది.