ఈవీఎంను నేలకేసి కొట్టిన జనసేన నేత.. పూర్తి సమాచారం అందాక స్పందిస్తానన్న పవన్ కల్యాణ్!
- జనసేన నేత మధుసూదన్ గుప్తా నిర్వాకం
- పోలింగ్ ఆఫీసర్ ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
- పనిచేయకుండా పోయిన ఈవీఎం
దీంతో పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. గుత్తిలోని బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 183వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగినట్లు తాను మీడియాలో చూశానని తెలిపారు. వాస్తవంగా అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. విషయం పూర్తిగా తెలుసుకోకుండా కామెంట్లు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై పార్టీ వర్గాల నుంచి పూర్తి సమాచారం అందుకున్న తర్వాతే మీడియాతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. అనంతరం పవన్ హైదరాబాద్ కు బయలుదేరారు.