Andhra Pradesh: ఉండవల్లిలో ఓటేసిన చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి

  • భవిష్యత్ మారాలంటే ఓటేయాల్సిందే: చంద్రబాబు
  • ఇవి చాలా కీలకమైన ఎన్నికలు
  • దేశానికి దశ, దిశ నిర్దేశించే ఎన్నికలివి: లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణితో కలిసి చంద్రబాబు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ఒక్కొక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్ మారాలంటే తప్పనిసరిగా ఓటేయాల్సిందేనన్నారు. మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇవి చాలా కీలకమైన ఎన్నికలని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దేశానికి దశ, దిశను నిర్దేశించాలని అన్నారు.
Andhra Pradesh
vundavalli
Chandrababu
Nara Lokesh
brahmini

More Telugu News