ఎంతో ఆవేదనతో బహిరంగ లేఖను రాసిన లాలూ ప్రసాద్ యాదవ్
- లాలూకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
- ఎన్నికల సమయంలో ప్రజలను దర్శించుకోకుండా చేశారన్న లాలూ
- నేను ప్రత్యక్షంగా పాల్గొనకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవే
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఓటర్లకు లాలూ ప్రసాద్ ఓ బహిరంగ లేఖ రాశారు. 44 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ప్రత్యక్షంగా పాల్గొనకుండా జరుగుతున్న తొలి ఎన్నిక ఇదేనని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల పండుగలో ప్రజలను దర్శించుకునే అవకాశం లేకుండా చేశారని బాధను వ్యక్తం చేశారు. అందుకే జైలు నుంచే మీకు లేఖను రాస్తున్నానని చెప్పారు. లేఖను అర్థం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యంగ విలువలను కాపాడుతారని ఆశిస్తున్నానని అన్నారు.