'మజిలీ' 5 రోజుల వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మజిలీ' 5 రోజుల వసూళ్లు

  • శివ నిర్వాణ నుంచి 'మజిలీ'
  • అయిదు రోజుల్లో 21.5 కోట్ల షేర్ 
  • కథాకథనాలు ప్రధాన బలం        
ఈ మధ్య కాలంలో ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించిన సినిమాగా 'మజిలీ' గురించి చెప్పుకోవాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీన భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజునే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లను రాబట్టింది.

నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమా 5 రోజుల్లో 21.65 కోట్ల షేర్ ను రాబట్టింది. చాలా కాలం తరువాత చైతూకి దక్కిన విజయం ఇది. పెళ్లి తరువాత చైతూ .. సమంత కలిసి చేసిన మొదటి సినిమా కావడమనేది ప్రత్యేక ఆకర్షణ అయింది. కథాకథనాల్లో బలం .. వైవిధ్యం, దివ్యాన్ష కౌశిక్ గ్లామర్ .. సక్సెస్ లో ప్రధాన పాత్రను పోషించాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హడావిడి తరువాత ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
chaitu
samanta
divyansha

More Telugu News