farooq abdullah: ఇలాంటి దాడులు... కశ్మీర్ లో అసంతృప్తి జ్వాలలను మరింత పెంచుతాయి: ఫరూక్ అబ్దుల్లా హెచ్చరిక

  • యాసిన్ మాలిక్ ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
  • తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫరూక్ అబ్దుల్లా
  • ఇలాంటివాటి వల్ల సాధించేది ఏమీ లేదని వ్యాఖ్య
కశ్మీర్ వేర్పాటువాద నేత, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధినేత యాసిన్ మాలిక్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేయడంపై నేషనల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. వేర్పాటువాద నాయకులపై ఇలాంటి దాడులు కొనసాగితే... కశ్మీరు లోయలో అసంతృప్తి జ్వాలలు మరింత తీవ్రతరమవుతాయని హెచ్చరించారు. యాసిన్ మాలిక్ ను అరెస్ట్ చేయడం పట్ల తాను అసంతృప్తికి గురయ్యానని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల సాధించేది ఏమీ ఉండదని అన్నారు. వేర్పాటు నాయకులను తొక్కేసే ప్రయత్నాలు ఎంత ఎక్కువగా జరిగితే... అంతే స్థాయిలో అసంతృప్తి చెలరేగుతుందని చెప్పారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుందని, వేరే అభిప్రాయం ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది భారతదేశ నైజం కాదని అన్నారు.
farooq abdullah
nc
yasin malik
jklf
nia
arrest

More Telugu News