మీ ఇంటి గేటు ముందున్నాం అమితాబ్ జీ... లోనికి పిలవండి: షారూక్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ ఇంటి గేటు ముందున్నాం అమితాబ్ జీ... లోనికి పిలవండి: షారూక్ ఖాన్

  • బిగ్ బీ తాజా చిత్రం 'బద్లా' 
  • రూ. 100 కోట్లు దాటిన వసూళ్లు
  • ఎవరూ ప్రమోట్ చేయడం లేదని బిగ్ బీ వ్యాఖ్య
  • ఊరడించిన షారూక్ ఖాన్
బాలీవుడ్‌ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ నటించిన తాజా చిత్రం 'బద్లా' సూపర్ హిట్ గా నిలిచి, రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లను సాధించింది. అయితే, ఈ విషయానికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. సినిమా కలెక్షన్ల గురించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ప్రకటించలేదు. దీనిపై అమితాబ్ బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేయగా, సూపర్ స్టార్ షారూక్ ఖాన్ ఊరడించే ప్రయత్నం చేశారు.

అమితాబ్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ, "చిత్ర నిర్మాత కానీ, డిస్ట్రిబ్యూటర్‌ కానీ, ఆన్‌ లైన్‌ ప్రొడ్యూసర్‌ కానీ... వీరందరితో పాటు బాలీవుడ్ కు చెందిన ఏ ఒక్కరు కూడా 'బద్లా' గురించి, అది సాధించిన విజయం గురించి మాట్లాడటం లేదు. వారికి ఒక్క క్షణం కూడా తీరిక లేదు. అయితేనేం, సినిమా హిట్టైంది. ధన్యవాదాలు' అని వ్యాఖ్యానించారు.

దీనిపై షారూక్ తనదైన శైలిలో స్పందిస్తూ, 'సార్‌... మీరు ఎప్పుడెప్పుడు పార్టీ ఇస్తారా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. రోజూ రాత్రుళ్లు జల్సా (అమితాబ్‌ ఇంటి పేరు) బయటే వేచి చూస్తున్నాం' అన్నారు. కాగా, రివెంజ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో 'బద్లా' తెరకెక్కగా, అమితాబ్ తో పాటు తాప్సీ ముఖ్యపాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
Amitabh Bachchan
Sharook Khan
Badla

More Telugu News