Sridevi: అమెరికా వెళ్లనున్న ఖుషీ.. అప్పుడే బెంగ పెట్టేసుకున్న బోనీ కపూర్!

  • నటిగా ఇప్పటికే నిరూపించుకున్న జాన్వి
  • మోడల్‌గా రాణిస్తున్న ఖుషీ 
  • అమెరికా వెళ్లి నటనలో శిక్షణ తీసుకోనున్న ఖుషీ
శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ విషయంలో బోనీ కపూర్ చాలా బాధపడుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ వెల్లడించింది. జాన్వి నటిగా ఇప్పటికే తనను తాను నిరూపించుకుంది. ఇప్పటికే మోడల్‌గా రాణిస్తున్న ఖుషీ కూడా నటిగా రాణించాలని ఆశ పడుతోందట.

దీని కోసం అమెరికా వెళ్లి న్యూయార్క్ ఫిలిం అకాడమీలో నటనలో శిక్షణ తీసుకోబోతోందని జాన్వి తెలిపింది. అయితే ఖుషీ అమెరికా వెళుతున్న విషయం తలచుకుంటే బోనీ ఏడ్చేస్తున్నారని జాన్వి ఆవేదన వ్యక్తం చేసింది. దర్శక నిర్మాత కరణ్ జొహార్ ఇప్పటికే ఖుషీ కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం.
Sridevi
Khushi Kapoor
Janvi
Boni kapoor
America

More Telugu News