Andhra Pradesh: ఎన్నికల ముంగిట ప్రకాశం జిల్లా ఎస్పీ బదిలీ

  • కోయ ప్రవీణ్ ను విధుల నుంచి తప్పించిన ఈసీ
  • కొత్త ఎస్పీగా సిద్ధార్థ్ కౌశల్
  • మంగళగిరి సీఐపైనా వేటు
ఎన్నికలు మరో రెండ్రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ ను బదిలీ చేసింది. ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రవీణ్ స్థానంలో సిద్ధార్థ్ కౌశల్ ను ప్రకాశం జిల్లా కొత్త ఎస్పీగా నియమించారు. డాక్టర్ కోయ ప్రవీణ్ ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లా ఎస్పీగా వచ్చారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆయన బదిలీకి గురికావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాదు, మంగళగిరి, తాడేపల్లి సీఐలపైనా బదిలీ వేటు పడింది. మంగళగిరి నుంచి ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను ఈసీ బదిలీ చేయడం తెలిసిందే. కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో పాటు ఇంటెలిజెన్స్ డీజీగా వెంకటేశ్వరరావును, రాష్ట్ర సీఎస్ గా పునేఠాను తప్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ బదిలీ కూడా రాష్ట్ర వర్గాల్లో చర్చనీయాంశం అయింది. 
Andhra Pradesh
Prakasam District

More Telugu News