Chandrababu: చంద్రబాబు ఏం చేసినా లోకేశ్ గెలవడు: వైసీపీ నేత ఆర్కే

  • ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ జెండా రెపరెపలాడుతుంది
  • లోకేశ్ కు ‘మంగళగిరి’ అని పలకడమే రాదు
  • పోలింగ్ డేట్ కూడా తెలియని వ్యక్తిని ప్రజలు ఎన్నుకుంటారా?
చంద్రబాబు ఏం చేసినా నారా లోకేశ్ గెలవలేడని, ఓటమి ఖాయమని మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) జోస్యం చెప్పారు. మంగళగిరిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లోకేశ్ పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘మీ అబ్బాయి 9వ తారీఖున జరిగే ఎన్నికల్లో గెలవలేడు. నువ్వు (చంద్రబాబు) ఎన్ని చేసినా మీ అబ్బాయి మంగళగిరిలో గెలవలేడు. నువ్వు ఎన్ని చేసినా 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో వైసీపీ గెలిచి తీరుతుంది. ‘మంగళగిరి’ అని పలకడమే రాదు. మంగళగిరి నైసర్గిక స్వరూపం తెలియదు. నామినేషన్ వేయడం రాదు. ఎన్నికల పోలింగ్ డేట్ తెలియదు. అలాంటి వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఎలా ఎన్నుకుంటారు?’ అంటూ లోకేశ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  
Chandrababu
cm
mangalgiri
YSRCP
RK

More Telugu News