Chandrababu: జగన్, కేసీఆర్... మోదీ పెంపుడు కుక్కలు: సత్తెనపల్లి రోడ్ షోలో చంద్రబాబు ఫైర్

  • మోదీ రోజుకో బిస్కెట్ వేస్తాడు
  • ఆ బిస్కెట్ తిని ఆనందంగా మనపై పడతారు
  • కోడికత్తి చాలా బలహీనుడు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సత్తెనపల్లె రోడ్ షోలో నిప్పులు చెరిగారు. జగన్, కేసీఆర్, మోదీలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. కోడికత్తి చాలా బలహీనుడని, 12 కేసుల్లో ఏ1 నిందితుడని అన్నారు. అలాంటి వ్యక్తి కేసులకు తప్పకుండా భయపడతాడని, అతడి భయాన్ని ఆసరాగా చేసుకుని కేసీఆర్, మోదీ ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ మోదీ పెంపుడు కుక్కలంటూ చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"మోదీ వీళ్లకు రోజుకో బిస్కెట్ వేస్తాడు. ఆ బిస్కెట్ తిని ఆనందంగా మనపై పడుతుంటారు. ఎంగిలి మెతుకులు మనకు అవసరమా? పాపిష్టి డబ్బులు మనకు అవసరమా? మనం సంపాదించుకోలేమా? మన దగ్గర ఆదాయం లేకపోయినా సత్తా ఉంది" అంటూ ఆవేశం ప్రదర్శించారు.
Chandrababu
Jagan
KCR
Narendra Modi

More Telugu News