Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదాకు, పోలవరం ప్రాజక్టుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం: వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన

  • మా పార్టీ ఎంపీలు సహకరిస్తారు
  • ‘హోదా’ ఇవ్వాలని మా ఎంపీలు లోక్ సభలో చెప్పారు
  • చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతోనే మా పంచాయితీ
ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే అంశంపై టీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. వికారాబాద్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తమ పార్టీ ఎంపీలు సహకరిస్తారని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ ఎంపీలు లోక్ సభలో చెప్పారని అన్నారు.

చంద్రబాబు వంటి కిరికిరి వ్యక్తులతోనే తప్ప ఏపీ ప్రజలతో తమ కెప్పుడూ పంచాయితీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు తనను తిడుతున్నారని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోవడం లేదని, దీని నిర్మాణానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా మాత్రమే అడుగుతున్నాం తప్ప, ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని, దాని బదులు ఆ నీళ్లు వాడుకుంటే మంచిదే కదా? అని అన్నారు. తమకు కులం, మతం, వర్గం లేవని, అందరూ బాగుండాలని కోరుకుంటామని చెప్పారు.
Andhra Pradesh
Telangana
cm
kcr
babu

More Telugu News