Janasena: పవన్ వెనుక మన బలం ఉందని నిరూపిద్దాం: మెగా హీరో కల్యాణ్ దేవ్

  • జన శ్రేయస్సునే తన దారిగా ఎంచుకున్నారు
  • ఒక్క ఓటుతో గాజు గ్లాసు గుర్తును గెలిపిద్దాం
  • బంగారు బాటకు మన ఓటుతో చేయూతనిద్దాం
మెగా హీరోలు ఒక్కొక్కరుగా జనసేనకు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ ఫేస్‌బుక్ వేదికగా జనసేనకు మద్దతు తెలిపారు.

‘‘జన శ్రేయస్సునే తన దారిగా ఎంచుకున్న జనసేనాని పవన్ కల్యాణ్‌గారిని అమూల్యమైన మన ఒక్క ఓటుతో గాజు గ్లాసు గుర్తును గెలిపిద్దాం. ఆయన వెనుక మనబలం ఉందని నిరూపిద్దాం. జనం కోసం ఆయన వెయ్యాలనుకునే బంగారు బాటకు మన ఓటుతో చేయూతనిద్దాం. పవన్ కల్యాణ్‌గారి రాజకీయ ప్రస్తానానికి నా హృదయపూర్వక శుభాభినందనలు. జై జనసేన- కల్యాణ్ దేవ్’’ అని కల్యాణ్ దేవ్ పోస్ట్ పెట్టారు.
Janasena
Pawan Kalyan
Chiranjeevi
Kalyan Dhev
Allu Arjun
Ram charan
Varun Tej

More Telugu News