మోదీకి ఆ దమ్ముందా?.. సవాల్ చేసిన శశిథరూర్
- రాహుల్ వాయినాడ్కు పారిపోయారని బీజేపీ ఎద్దేవా
- మోదీకి దక్షిణాది నుంచి పోటీ చేసే దమ్ము లేదన్న శశిథరూర్
- తర్వాతి ప్రధాని ఇక్కడి నుంచేనన్న సీనియర్ నేత
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని పేర్కొన్న శశిథరూర్.. దేశ తర్వాతి ప్రధాని దక్షిణాది నుంచే వస్తాడని ప్రజలు భావిస్తున్నారని థరూర్ పేర్కొన్నారు. ఓటమి భయంతో రాహుల్ వయనాడ్కు పారిపోయారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారంలో అర్థం లేదన్నారు. వాయినాడ్ నుంచి పోటీ చేయాలంటూ రాహుల్పై అనూహ్యమైన ఒత్తిడి రావడం వల్లే రాహుల్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు.