వీవీప్యాట్ల లెక్కింపు వ్యవహారం.. సుప్రీంకోర్టులో చంద్రబాబు కౌంటర్ అఫిడవిట్
- ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు వేళుతోందని ఆరోపణ
- 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలంటూ ఈసీకి ఫిర్యాదు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన 21 పార్టీల ప్రతిపక్ష బృందం
ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా ఓట్లు బీజేపీకే పడుతున్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు నేతృత్వంలోని 21 పార్టీలకు చెందిన విపక్ష నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా ఉండే ఈవీఎంలలో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికీ... ఫలితాలు వెల్లడించడానికీ దాదాపు ఆరు రోజులు పడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ యేతర పార్టీల బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు రోజులు పట్టినా పర్వాలేదనీ, వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించాలని ఆదేశించాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ నేడు విచారణకు రానుంది.