టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కాలేజీపై ఎన్నికల అధికారుల దాడులు!
- అనంతపురం జిల్లా యాడికిలో సోదాలు
- టీడీపీ జెండాలు, కరపత్రాలు లభ్యం
- రెండు గదుల్లో తనిఖీలు చేయకుండానే వెనుదిరిగిన అధికారులు
ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన అధికారులకు ఓ గదిలో టీడీపీ కండువాలు, కరపత్రాలు లభించాయి. అయితే ప్రిన్సిపాల్ రూము, మరో గదికి సంబంధించిన తాళాలు లేకపోవడంతో అధికారులు తనిఖీలు చేపట్టకుండానే వెనుదిరిగారు. కాగా, ఈ సోదాల్లో ఇప్పటివరకూ ఎలాంటి నగదు లభించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు కాలేజీ ప్రిన్సిపాల్ బెంగళూరు నుంచి వచ్చాక ఈ రెండు గదుల్లో తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.