Chandrababu: కేసీఆర్ నువ్వూ రా!... నీ గురువు మోదీని కూడా తీసుకురా... చూసుకుందాం!: చీరాల రోడ్ షోలో చంద్రబాబు సవాల్

  • కట్టకట్టి బంగాళాఖాతంలో పారేస్తా!
  • ఎవరొచ్చినా ఏమీ చేయలేరు
  • దొంగలంతా ఒక్కటయ్యారు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ప్రచారం ముగింపునకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉండడంతో సుడిగాలి వేగంతో జిల్లాల్లో ప్రచార సభలకు హాజరవుతున్నారు. ఇవాళ ప్రకాశం జిల్లా కందుకూరు, సంతనూతలపాడు సభల్లో పాల్గొన్న చంద్రబాబు ఆపై చీరాలలో రోడ్ షోకు విచ్చేశారు. చీరాలలో తన కోసం వచ్చిన భారీ జనసందోహాన్ని చూడగానే ఆయన తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొంగలంతా వైసీపీలో చేరారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చీరాలలో కూడా ఓ దొంగ తయారయ్యాడంటూ ఆమంచి కృష్ణమోహన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చీరాల దొంగను, అతడ్ని పార్టీలో చేర్చుకున్న నేరస్తుడ్ని చిత్తుగా ఓడించాలని చీరాల ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకు తెలంగాణ నుంచి కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నాడని ఆరోపించారు.

"ఆయన నాకో రిటర్న్ గిఫ్ట్ పంపిస్తానన్నాడు. కానీ వంద గిఫ్టులు నేనే పంపిస్తా. వచ్చి ప్రచారం చేస్తానన్నాడు కేసీఆర్. రమ్మని చెప్పా... వస్తే నీ కథ తెలుస్తానని చెప్పా. నువ్వూ రా... నీ గురువు మోదీని కూడా రమ్మను... జగన్ ను రమ్మను...  ముగ్గుర్ని కలిపి కట్టకట్టి బంగాళాఖాతంలోకి విసిరేస్తా!" అంటూ నిప్పులు చెరిగారు.
Chandrababu
Telugudesam
KCR
Jagan
Narendra Modi

More Telugu News