Pawan Kalyan: పవన్ బాబాయ్ తో కలిసి రెండ్రోజుల పాటు రామ్ చరణ్ ప్రచారం!

  • కాసేపట్లో విజయవాడ రానున్న చెర్రీ
  • తెనాలి సభకు హాజరయ్యే అవకాశం
  • జనసేనానికి మద్దతుగా మెగా హీరోలు!
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రామ్ చరణ్ ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. దాంతో షూటింగ్ ఆపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, మరికొన్ని రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బాబాయ్ పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. చెర్రీ రెండ్రోజుల పాటు పవన్ వెంటే ఉంటాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మరికాసేపట్లో విజయవాడ చేరుకోనున్నారు.

అటు, వడదెబ్బ నుంచి కోలుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ తెనాలి సభకు హాజరవుతుండగా, రామ్ చరణ్ కూడా ఆ సభలో పాల్గొనే అవకాశాలున్నాయి. కాగా, అల్లు అర్జున్ ఇప్పటికే నాగబాబు, పవన్ కల్యాణ్ లకు తన మద్దతు ఉంటుందని బహిరంగ లేఖ ద్వారా తెలుపగా, వరుణ్ తేజ్ జనసేన అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
Pawan Kalyan
Ramcharan
Jana Sena

More Telugu News