Pawan Kalyan: వడదెబ్బ నుంచి కోలుకున్న పవన్ కల్యాణ్

  • నేడు తెనాలిలో ప్రచారం!
  • శుక్రవారం అస్వస్థతకు గురైన జనసేనాని
  • ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వడదెబ్బ నుంచి కోలుకున్నారు. శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం కోసం వచ్చి అస్వస్థతకు గురయ్యారు. దాంతో సత్తెనపల్లి, తెనాలి సభలు రద్దయ్యాయి. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఆయన ఎండవేడిమికి తట్టుకోలేక కళ్లుతిరిగి పడిపోయారు. దాంతో పవన్ ను ఆయుష్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాత్రి పొద్దుపోయాక డిశ్చార్జ్ అయ్యారు. అయితే, ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో పవన్ తెనాలి లో ఎన్నికల ప్రచారానికి హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. వడదెబ్బ నుంచి కోలుకున్న పవన్ ఈరాత్రి తెనాలిలో రోడ్ షో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pawan Kalyan
Jana Sena

More Telugu News