హిందూమతానికి కాదు... స్వార్థపరులైన హిందుత్వవాదులకు మేం వ్యతిరేకం: అసదుద్దీన్ ఒవైసీ
- ఎన్నిక వేళ ఎంఐఎం అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు
- టీఆర్ఎస్కు మద్దతుగా నల్లగొండ సభలో ప్రసంగం
- మైనార్టీలకు టీఆర్ఎస్ హయాంలోనే రక్షణ అని వ్యాఖ్య
బడుగు, బహీనవర్గాలు, దళితులు, మైనార్టీలకు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తి రక్షణ ఉందని చెప్పారు. అందుకే ఆ పార్టీతో తాము బహిరంగంగానే చేతులు కలిపి పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల్లా రహస్య ఒప్పందాలు, తెరవెనుక రాజకీయాలు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం కలిపి మొత్తం 17 ఎంపీ స్థానాలను గెల్చుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.