లక్ష్మీపార్వతి గురించి అలా మాట్లాడటం చాలా తప్పు: జీవితా రాజశేఖర్ ఆగ్రహం
- కంప్లయింట్ ఇచ్చిన వాడి వయసేంటి?
- ఎన్నికలకు ముందే మాట్లాడాల్సిన అవసరమేంటి?
- ఫిర్యాదు నిరూపితమే కాలేదు ఛానెల్స్ లో చూపిస్తారా?
లక్ష్మీపార్వతిపై ఆరోపణల గురించి టీవీ ఛానెల్స్ లో చూపిస్తున్న వాళ్లకు అమ్మలు, అక్కాచెల్లెళ్లు లేరా? చేసిన ఫిర్యాదు నిరూపితమైందా? ఈ లోపే, అతన్ని తీసుకొచ్చి ఛానెల్స్ ముందు కూర్చోబెట్టి మాట్లాడిస్తారా? ఏ ఛానెల్స్ వాళ్లు అయితే అతనితో మాట్లాడిస్తున్నారో, వాళ్లు కూడా ఓ అమ్మకు పుట్టినవాళ్లేగా అని నిప్పులు చెరిగారు. ఇలాంటి ఛానెల్స్ మీడియా పరువును తీస్తున్నాయని, ఇలాంటి సంపాదన కావాలా? అని దుమ్మెత్తిపోశారు. ఇలాంటి వాళ్లను మీడియా వాళ్లే వెలివేయాలని జీవితా రాజశేఖర్ సూచించారు.