టీడీపీ నేత మండవ వెంకటేశ్వరరావు ఇంటికెళ్లిన కేసీఆర్.. టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానం!
- హైదరాబాద్ లోని మండవ ఇంటిలో ఈరోజు భేటీ
- టీఆర్ఎస్ కు, తెలంగాణకు అనుభవజ్ఞుల అవసరముందని వ్యాఖ్య
- ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేసిన మండవ
నిజామాబాద్ జిల్లాలో టీడీపీకి మండవ వెంకటేశ్వరరావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.