Kuppam: చంద్రబాబుపై గెలిపిస్తే, చంద్రమౌళికి మంత్రి పదవి: జగన్ ఆఫర్
- సమర్థుడైన ఐఏఎస్ అధికారి చంద్రమౌళి
- ఓ మంత్రిగా ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటారు
- ప్రజలు కోరుకుంటున్నవన్నీ చేస్తారన్న జగన్
కుప్పంలో తాను ఓ మంచి సమర్థుడైన ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని ఏరికోరి చంద్రబాబుపై పోటీకి నిలిపానని, ఇక్కడి ప్రజలు ఆయన్ను గెలిపిస్తే, మంత్రివర్గంలోకి తీసుకుంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజలు చంద్రమౌళికి తమ ఓటు వేసి గెలిపించాలని, ఆపై ఓ మంత్రిగా ఆయన ఇక్కడి ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉంటూ, ప్రజలు ఏమేం కోరుకుంటున్నారో, వాటన్నింటినీ చేస్తారని చెప్పారు.
నేడు తాను చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, టీవీ 9లతో పాటు అమ్ముడుపోయిన మీడియాతో యుద్ధం చేస్తున్నానని, మరో వారం రోజుల పాటు ఇలాగే కుట్రలు జరుగుతుంటాయని జగన్ ఆరోపించారు. కుప్పంలో తనకు ఎదురుగాలి వీస్తోందన్న విషయం చంద్రబాబుకు తెలుసునని, అందువల్ల ప్రతి ఇంటికీ డబ్బులను పంపేందుకు ఆయన ఏర్పాటు చేస్తున్నారని, ఆ డబ్బు తీసుకుని మోసపోవద్దని జగన్ సూచించారు.