ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గుడ్లూరు మండలం శాంతినగర్ లో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అక్కడే ఆగిఉన్న ఓ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే ముగ్గురు చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధిత కుటుంబం విశాఖ నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చనిపోయినవారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Andhra Pradesh
Prakasam District
Road Accident
3 dead
Police

More Telugu News