jagan: వైసీపీలో యాక్టర్లు లేరా?: పవన్ కల్యాణ్

  • ఏ2గా ఉన్న వ్యక్తిని వెంటపెట్టుకుని జగన్ ఎందుకు తిరుగుతున్నారు?
  • మోదీ, అమిత్ షా అంటే జగన్ కు భయం
  • పులివెందులకు వెళ్తే దళితులపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది
తనను యాక్టర్ అంటూ విమర్శిస్తున్న వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీలో యాక్టర్లు లేరా? అని విమర్శించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అంటే జగన్ కు భయమని చెప్పారు. పలు కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తిని వెంటపెట్టుకుని జగన్ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలు... అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని అన్నారు. దళితులపై జగన్ కు ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే... పులివెందులకు వెళ్లాలని సూచించారు. విశాఖలోని అక్కయ్యపాలెంలో ప్రచారం సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
jagan
Pawan Kalyan
ysrcp
janasena

More Telugu News