అద్భుతమైన ఇళ్ల మధ్య నా సెల్ఫీ: నారా లోకేశ్

  • ప్రభుత్వం కట్టిస్తున్న ఇళ్లు అద్భుతం
  • అత్యాధునిక ప్రమాణాలున్నాయి
  • ట్విట్టర్ లో నారా లోకేశ్
పేద ప్రజలకు చంద్రబాబు సర్కారు నిర్మించి ఇస్తున్న ఇళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని, వాటిని చూస్తుంటే, పేదరికాన్ని పారద్రోలుతున్నట్టుగా అనిపించిందని ఏపీ మంత్రి, మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ పడుతున్న నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎన్టీఆర్ గృహ సముదాయాల ముందు సెల్ఫీ దిగిన లోకేశ్, ఆ చిత్రాన్ని తన అభిమానులు, టీడీపీ కార్యకర్తలతో ట్విట్టర్ లో పంచుకున్నారు. "చంద్రన్న ప్రభుత్వం అత్యాధునిక ప్రమాణాలతో, పేదల కోసం కట్టించిన అత్యద్భుతమైన ఎన్టీఆర్ గృహ సముదాయాలు" అని ఆయన వ్యాఖ్యానించారు.



Go Back to Shorts
Nara Lokesh
Mangalagiri
Telugudesam

More Telugu News