టీఆర్ఎస్ ఎంపీలు నోరు కూడా మెదపరు.. నన్ను గెలిపిస్తే నల్గొండను స్మార్ట్ సిటీగా చేస్తా!: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- టీఆర్ఎస్ కు కేంద్రం సహకరిస్తోంది
- ఫెడరల్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థి ఎవరో కేసీఆర్ చెప్పాలి
- నల్గొండలో మీడియాతో టీపీసీసీ చీఫ్
ఈ లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నల్గొండను స్మార్ట్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. నల్గొండలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణ సీఎం చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ పై ఉత్తమ్ విమర్శలు గుప్పించారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరో కేసీఆర్ ముందుగా చెప్పాలని డిమాండ్ చేశారు.