Andhra Pradesh: ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు రోడ్ షోపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు!

  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఆపేశారు
  • సినిమా ఆలస్యం కావడంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన రామ్ గోపాల్ వర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల నెల్లూరులో నిర్వహించిన రోడ్ షోకు జనాలే లేరంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యంగ్యంగా స్పందించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదల ఆలస్యం కావడంపై ఏపీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని వర్మ తెలిపారు.

అందుకే చంద్రబాబు నిర్వహించిన నెల్లూరు రోడ్ షోను ప్రజలు బాయ్ కాట్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదలకు అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే విషయమై ఏపీ హైకోర్టు ఈరోజు నిర్ణయం తీసుకోనుంది.
Andhra Pradesh
Chandrababu
RGV
Twitter
nellore road show

More Telugu News