కేటీఆర్, హరీశ్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన సునీతా లక్ష్మారెడ్డి

  • మెదక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేసిన సునీత
  • ఇటీవలే కేటీఆర్‌ను కలిసి వెల్లడి
  • అనూహ్యంగా నేడు పార్టీలో చేరిన సునీత
మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నేడు టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీతా లక్ష్మారెడ్డి పని చేశారు.

ఇటీవలే కేటీఆర్‌ను కలిసిన సునీతా లక్ష్మారెడ్డి తాను టీఆర్ఎస్‌లో చేరాలనుకుంటున్నట్టు తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో నర్సాపూర్‌లో సీఎం కేసీఆర్ సభ జరగనుంది. ఈ సందర్భంగా సునీతా గులాబీ గూటికి చేరుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నేడే ఆ పార్టీలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు.
Go Back to Shorts
KCR
KTR
Sunitha Laxma Reddy
TRS
Harish Rao

More Telugu News