lakshmeesh NTR: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’పై స్టే ఎత్తివేయండి : సుప్రీం తలుపు తట్టిన నిర్మాత

  • ఇప్పటికే నవ్యాంధ్ర మినహా అన్ని చోట్లా విడుదల
  • ఆంధ్రలో విడుదలకు అనుమతి ఇవ్వాలని వేడుకోలు
  • చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని కోర్టులో కేసు
రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను నవ్యాంధ్రలో కూడా విడుదలకు అనుమతించాలంటూ చిత్ర నిర్మాత రాకేష్‌రెడ్డి ఈరోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రతిష్ట దెబ్బతీసేలా చిత్రం ఉందని ఆరోపిస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో కోర్టు నవ్యాంధ్రలో విడుదలపై స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో సినిమా గత నెల 29వ తేదీనే విడుదలైంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఆడేందుకు అనుమతించాలని రాకేష్‌ రెడ్డి సుప్రీం కోర్టును కోరారు.
lakshmeesh NTR
High Court
rakeshreddy
Supreme Court

More Telugu News