Lakshmis NTR: వర్మకు షాక్... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై అంత తొందరేంటన్న సుప్రీంకోర్టు!

  • అత్యవసర విచారణ అవసరం లేదు
  • హైకోర్టే నిర్ణయం తీసుకుంటుంది
  • చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్
అత్యున్నత న్యాయస్థానంలో రామ్ గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ఆయన దర్శకత్వం వహించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయమై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ వర్మ తరఫున ఈ ఉదయం పిటిషన్ దాఖలు కాగా, అత్యవసర విచారణ చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ పిటిషన్ ను డిస్ మిస్ చేస్తూ, ఏప్రిల్ 3న హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ ఎందుకు ఆగరని ప్రశ్నించారు. హైకోర్టే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని, అక్కడ వ్యతిరేక నిర్ణయం వస్తే అప్పుడు తమను ఆశ్రయించాలని అన్నారు.
Lakshmis NTR
Supreme Court
Ranjan Gogoi
Ramgopal Varma

More Telugu News