Jaya Sudha: టాలీవుడ్ లో 80 శాతం మంది జగన్ పక్షానే ఉన్నారు: జయసుధ వెల్లడి

  • వైఎస్ చిత్ర పరిశ్రమకు ఎంతో చేశారు
  • జగన్ సీఎం కావాలి
  • కేసీఆర్ ఒత్తిడి చేయడం లేదు
సినీ నటి, వైసీపీ నాయకురాలు జయసుధ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె, తెలుగు చిత్ర పరిశ్రమలో 80 శాతం మంది జగన్ కు మద్దతు పలుకుతున్నారని వెల్లడించారు. అప్పట్లో వైఎస్సార్ సినీ రంగానికి ఎంతో మేలు చేశారని, ఆ కృతజ్ఞతతోనే టాలీవుడ్ లో అత్యధికులు జగన్ పక్షాన నిలిచారని వివరించారు. సొంతగా పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి జగన్ అని, ఆయన సీఎం అవ్వాలన్నది తన కోరిక అని జయసుధ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రచారానికి వచ్చానని, మీడియాలో వస్తున్నట్టుగా తమపై కేసీఆర్, టీఆర్ఎస్ ఒత్తిళ్లు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. తాము జగన్ పై అభిమానంతోనే వస్తున్నామని అన్నారు.
Jaya Sudha
Jagan
YSRCP
Tollywood

More Telugu News