Tollywood: ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ్ముడి కోసం నర్సీపట్నం వచ్చిన పూరీ జగన్నాథ్

  • వైసీపీ ఆఫీసులో సందడి చేసిన పూరీ
  • దివ్యాంగుడితో కరచాలనం
  • ఫొటోల కోసం ఎగబడిన అభిమానులు
టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. పూరీ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేశ్ నర్సీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై స్వల్ప తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు. ఈసారి తమ్ముడి గెలుపు కోసం తనవంతు సహకారం అందించే క్రమంలో పూరీ నర్సీపట్నం వచ్చి వైసీపీ ఆఫీసులో సందడి చేశారు. అక్కడ తనను కలిసి అభిమానులతో ముచ్చటించారు. ఓ దివ్యాంగుడు పూరీని కలిసి మురిసిపోయాడు. అతడితో కాసేపు మాట్లాడిన పూరీ, అనంతరం అభిమానులతో కలిసి ఫొటోలు తీయించుకున్నారు.
Tollywood
Puri Jagannadh

More Telugu News