ISRO scientists: పీఎస్‌ఎల్‌వీ సీ45 వాహకనౌక నమూనాతో శ్రీవారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు

  • స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు
  • రంగనాయకుల మండపంలో వేదాశీర్వాదం
  • ఆనవాయితీని పాటించిన ఇస్రో బాధ్యులు
ఏదైనా రాకెట్‌ ద్వారా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపినా, రాకెట్‌ పనితీరు పరిశీలించినా వాటి నమూనాలతో తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇస్రో శాస్త్రవేత్తల అలవాటు. ఈ ఆనవాయితీని ఈరోజు కొనసాగించారు. త్వరలో ప్రయోగించనున్న పీఎస్‌ఎల్వీ సీ45 వాహకనౌక నమూనాతో ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలు నమూనాను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు జరిపించారు.

ఈ ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న శాస్త్రవేత్తలకు అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ISRO scientists
Tirumala
PSLV C45

More Telugu News